విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.-2లక్షల విరాళం
శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (విజయక్రాం తి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని లింగంపల్లి గ్రామంలో గ్రామదేవతలైన శ్రీ నల్లపోచమ్మ,భూలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు.ఆలయ కమిటీ, భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.రవికుమార్ యాదవ్ అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామదేవతలు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రక్షగా ఉండాలని, తమ ఆశీస్సులతో అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో సామరస్యం,భక్తిభావం పెంచుతాయని అన్నారు.ఆలయాభివృద్ధి,దైవకార్యాలకు తన వంతు సహాయంగా రూ. 2 లక్షల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎల్లేష్, కిషోర్, రవి యాదవ్, శ్రీనివాస్ ముదిరాజ్, కృష్ణ యాదవ్, సోమయ్య యాదవ్, నరేందర్ యాదవ్, బాబు, శ్రీను, విజయ్ తదితరులు పాల్గొన్నారు.






