9 April, 2026 | 9:50 AM

శంషాబాద్‌లో ఆక్రమణల కూల్చివేత

08-12-2024 01:07 AM

రాజేంద్రనగర్, డిసెంబర్ 7: హెచ్‌ఎండీఏ అధికారులు శంషాబాద్ పట్టణంలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించారు. శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎయిర్‌పోర్టు ర్యాంపు సమీపంలో హెచ్‌ఎండీఏకి చెందిన భూములు ఉన్నాయి. ర్యాంపు పక్కన ఉన్న స్థలాల్లో కొందరు అక్రమంగా దుకాణాలు, ఇతర నిర్మాణా లు చేపట్టారు. ఈ విషయమై స్థానికులు హెచ్‌ఎండీఏ అధికారులకు ఫిర్యాదు చేయడంతో హెచ్‌ఎండీఏ అదనపు కలెక్టర్ షర్మిల ఆధ్వర్యంలో శనివారం ఆయా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.