10 April, 2026 | 1:59 AM

గజ్వేల్‌లో మరో మినీ ట్యాంక్ బండ్

10-04-2026 12:00 AM
  1. రూ. 3.14 కోట్లతో ముట్రాజ్ పల్లి 

బర్రి చెరువు సుందరీకరణ

చెరువును పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్

గజ్వేల్ ఏప్రిల్ 9: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మరో చెరువు కట్ట మినీ ట్యాంక్ బండ్ గా మారనుంది. ముట్రాజ్ పల్లి బర్రి చెరువు కట్టను సుందరీకరణ పనులకు ప్రభుత్వం రూ. 3.14 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో పాటు టెండర్లు కూడా పూర్తి చేసింది. సుందరీకరణ పనుల నిర్వహణ కోసం చేపట్టేందుకు అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఇరిగేషన్ ఈఈ విటిటి శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ డిఈఈ మహేష్ బాబు, డిఈఈ భాస్కర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ తో కలిసి పరిశీలించారు. బరి చెరువు కట్ట ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు.

ఇరిగేషన్ పబ్లిక్ హెల్త్ అధికారులతో కట్ట నిర్మాణం, సుందరీకరణ పనులను పటిష్టంగా నిర్వహించాలని, కాంట్రాక్టర్లకు సరైన దిశా నిర్దేశం చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 79 చెరువుల సుందరీకరణ పనులు చేపడుతుండగా, దీనిలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో బర్రి చెరువుతోపాటు, సిద్దిపేట మున్సిపాలిటీలో రెండు, చేర్యాలలో ఒక చెరువు కట్ట సుందరీకరణ పనులు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ మహేష్, ఇరిగేషన్ ఏఈ తదితరులు పాల్గొన్నారు.