8 June, 2026 | 7:22 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచ్‌ల పంపిణీ

10-04-2026 12:00 AM

లింగంపేట్, ఏప్రిల్ 9  (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శేట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సికింద్రాబాద్ జూనియర్ ఛాంబర్ చారిటెబుల్ ట్రస్ట్ , జూనియర్ ఛాంబర్స్  ఇంటర్నేషనల్ ట్రస్ట్ లా సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు గురువారం బెంచీలు పంపిణీ చేశారు.

శెట్పల్లి కీ లక్ష రూపాయల విలువ చేసే 30 డ్యూయల్  డెస్క్ బెంచిలు  విద్యార్థులు కూర్చోవాటానికి ఎస్ జె సి ట్రస్ట్ అధ్యక్షులు నాగ శ్రీధర్ , జె సి ఐ ప్రెసిడెంట్ రవళి సోమ  రిబ్బన్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి నాగ శ్రీధర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ విద్యార్థులకు మేము సహాయం చేయటం మాకు చాల సంతృప్తిని ఇస్తుందన్నారు.

విద్యార్థులు బాగా చదువుకొని అభివృద్ధి చెందితే మా సహాయానికి అర్థం పరమార్థం ఉంటుంది అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసుధ  మాట్లాడుతూ మా పాఠశాలకు 30 డ్యూయల్  డెస్క్లు కావాలని ట్రస్ట్ వారిని అడిగిన వెంటనే స్పందించి పంపిణీ చేయటం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమానికి  నాగ శ్రీధర్ బూరుగు  ప్రెసిడెంట్, సికింద్రాబాద్ జూనియర్ ఛాంబర్,   రవళి సోమ  ప్రెసిడెంట్  జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ,జెసిఐ వైస్ ప్రెసిడెంట్ పార్సి ప్రతి,ఎస్ జె సి సెక్రెటరీ శిరీష్ జవ్వాజి , జె సి ఐ సెక్రెటరీసాయి సాత్విక్ , ఎస్ జె సి ప్రతినిధినవీన్ మజ్జెటి, జే సి ఐ సతీష్ ఎస్ జె సి ప్రాజెక్ట్ చైర్మన్ సతీష్ బెజుగం,ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం, శ్రీదేవి ఎంపీపీ ఎస్ టెక్రియల్ జెడ్ పి హెచ్ ఎస్ శెట్పల్లి పాఠశాల సిబ్బంది రవి, హరి కిషన్, అశోక్, మంగమ్మ, కవిత, రాజేష్, సంతోష్ కుమార్, పడమటి రాజు పాల్గొన్నారు.