calender_icon.png 30 July, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీలో మరో కొత్త కోర్సు!

13-12-2024 02:35:02 AM

బీఏ సెక్యూరిటీ డిఫెన్స్ ఏవియేషన్ లా

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): డిగ్రీలో మరో కొత్త కో ర్సును ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. బీఏ సెక్యూరిటీ డిఫెన్స్ ఏవి యేషన్ లా కోర్సును ప్రవేశపెట్టబోతోంది. ఇందుకు కసరత్తును ప్రారం భించింది. దీనిని ఆన్‌లైన్ కోర్సుగా తీసుకురావాలని భావిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. అయితే ఈ కోర్సు ఆరు నెలలా? ఏడాదా? లేకపోతే పూర్తిస్థాయి డిగ్రీని ప్రవేశపెట్టా? అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గురువారం ఆయనను కలిసిన విలేకరులతో తెలిపారు.

వచ్చే విద్యా సంవత్సరం నుం చి అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కోర్సు చేసినవారికి డిఫెన్స్ ఏవియేషన్ లా రంగంలో ఎక్కువగా డిమాండ్ ఉం డటంతో దీనిని రూపొందిస్తున్నట్టు వివరించారు. గతంలో ఆయన నల్సార్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా పనిచేసినప్పుడు ఎంఏలో ఈ తరహా కోర్సునే ప్రవేశపెట్టడంతో ఎంతో మంది విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలు దక్కాయని గుర్తుచేశారు.

తొలుత నాలుగైదు డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సును ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపా రు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వా రితో తరగతులను బోధించేలా చర్య లు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు