30-07-2025 09:10:13 AM
ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి
నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): విద్య అనేది విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి, సమాజంలో మంచి పౌరుడిగా ఎదగడానికి బలం ఇచ్చే సాధనమని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి(Nagarkurnool MLA Dr. Kuchakulla Rajesh Reddy) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఉత్తమ పీఎం శ్రీ పాఠశాలగా ఎంపికైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి పరచడంలో అగ్రగామిగా ఉన్నదన్నారు. ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పిఎమ్ శ్రీ) పథకానికి ఐదేళ్లు పూర్తి కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ను విద్యా హబ్‌గా అభివృద్ధి చేయడం మా లక్ష్యమని ఇప్పటికే మెడికల్ కాలేజ్ పూర్తి కాగా త్వరలో ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతి ఇప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లత, మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.