30-07-2025 10:15:14 AM
హైదరాబాద్: ఏపీ లిక్కర్ స్కాం(AP Liquor Case) కేసులో కీలక మలుపు తిరిగింది. ఏ40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో సిట్ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ శివారు ఫామ్ హౌస్(Hyderabad Farm House)లో రూ. 11 కోట్ల నగదు పట్టుబడింది. వర్థమాన్ కళాశాల వద్ద ఉన్న విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో నగదు దొరికింది. ఫామ్ హౌస్ యజమాని విజయేందర్ రెడ్డిగా గుర్తించారు. ఫామ్ హౌస్ విజయేందర్ రెడ్డి(Vijayender Reddy) తల్లి సులోచన పేరుతో ఉంది. ఫామ్ హౌస్ లోనే వర్ధమాన్ కళాశాల(Vardhaman College of Engineering) క్రీడా ప్రాంగణం, వసతి గదులున్నాయి.
ఫామ్ హౌస్ లోని స్టోర్ రూంలో బియ్యం బస్తాల మధ్య నగదు దాచారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏపీ సిట్ అధికారులు(AP SIT officials) నగదు జప్తు చేశారు. సిట్ అధికారుల సోదాల్లో రూ.11 కోట్ల నగదు లభ్యమైంది. పట్టుబడిన నగదుపై ఈడీ, ఐటీ దృష్టి సారించే అవకాశముంది. సిట్ తొలి ఛార్జిషీట్ లోనే యూపీ డిస్టలరీస్ పేరు ప్రస్తావన వచ్చింది. 16 డిస్టిలరీల ముడుపులే రూ. 1,677.68 కోట్లుగా సిట్ గుర్తించింది. రాజ్ కెసిరెడ్డి బినామీ సంస్థనే యూవీ డిస్టిలరీస్(UV Distilleries) గా సిట్ గుర్తించింది. తీగల ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి హైదరాబాద్ లోని అరెట్ ఆస్పత్రి(Arete Hospitals) డైరెక్టర్లుగా ఉన్నారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కు యూవీ డిస్టలరీస్ కు రూ. 224.53 కోట్లు జమ చేసింది. రూ. 224.53 కోట్లలో ముడుపులుగా రూ. 29.8 కోట్లు యూవీ డిస్టిలరీస్ కు వెనక్కి వచ్చింది. ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వరుణ్‌ను సిట్ అదుపులోకి తీసుకుంది. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వరుణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సిట్ పేర్కొంది.