30-07-2025 09:14:58 AM
మునగాల,(విజయక్రాంతి): మండల పరిధిలోని గణపవరం గ్రామంలో(Ganapavaram village) చెరువుశిఖం భూమి విషయమై గత సంవత్సర కాలంగా గ్రామానికి చెందిన దళిత కుటుంబాలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తూ తమని ఇబ్బందులకు గురిచేస్తున్న మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై చట్టరీత్యా తక్షణమే చర్యలు తీసుకొని ఆయనను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు పలువురు గణపవరం గ్రామానికి చెందిన దళితులు ధర్నా నిర్వహించారు.
అనంతరం స్థానిక తహసిల్దార్ కు గణపవరం గ్రామంలోని చెరువు భూమిలో భూమి యాజమాన్య హక్కు కల్పించి నిరుపేదలైన దళితులకు సేద్యం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని తహసీల్దార్ రామకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు, తదుపరి స్థానిక అంబేద్కర్ విగ్రహం నందు దళితులపై అక్రమ కేసులు నమోదును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి తమ యొక్క నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు, ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూరి స్వరాజ్యం, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ బిఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి ఎల్పి రామయ్య, కాంగ్రెస్ పార్టీ గణపవరం గ్రామ శాఖ అధ్యక్షుడు సూరేపల్లి రమేష్ పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు, సూరేపల్లి పిచ్చయ్య, సూరేపల్లి కోటయ్య, సూరేపల్లి వెంకన్న, మాతంగి భిక్షం, బచ్చలకూరి వెంకటేష్, సూర్యపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.