30-07-2025 10:18:57 AM
నాగార్జునసాగర్,విజయక్రాంతి: నాగార్జున సాగర్ జలాశయం(Nagarjuna Sagar Reservoir) నుంచి క్రస్ట్ గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు కనులారా తిలకిస్తున్నారు. బిరా బిరా మంటూ పరిగెడుతూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సందడి చేస్తోంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి కిందకు అందంగా కృష్ణమ్మ పరవళ్లు పెడుతుండడాన్ని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. నాగార్జున సాగర్ 26 గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు కనులారా తిలకిస్తున్నారు. పాలనురగలా స్పీల్ వే గుండా కృష్ణమ్మ పరవళ్లు తోక్కుతోంది. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ జలసోయగాలు వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో నాగార్జున సాగర్(Nagarjuna Sagar) జళకళను సంతరించుకుంది.వర్షాకాలం వచ్చిందంటే చాలు నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పర్యాటకుల సందడి మామూలుగా ఉండదు. ఈసారి కుండపోత వర్షాలు కురవడంతో పెద్దఎత్తున జలాశయానికి నీరు చేరింది.నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తుతున్న భారీ వరద. ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు.16 గేట్లు 5 ఫిట్లు,10గేట్లు10 ఫీట్ల మేర పైకి ఎత్తి 2,68,004 క్యూసెక్కుల నీటిని దిగువకు దిగువకు విడుదల చేస్తున్న అధికారులు... ఇన్ ఫ్లో : 1,6,9186 క్యూసెక్కులు.ఔట్ ఫ్లో : 3,14,228 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం : 586.80 అడుగులు. పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ :304.4680 టీఎంసీలు.ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450.టీఎంసీలు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. జలాశయం పూర్తి స్థాయిలో నిండటంతో ఎగువ నుంచి వచ్చే వరదను,దిగువకు విడుదల చేస్తున్నారు.సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రస్తుత, పూర్తి నీటిమట్టం 590 అడుగులు ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గానూ, ప్రస్తుత నీటినిల్వ 303.టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం ఆధారంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు చేపడతున్నారు.
పర్యాటకుల రాకతో కళకళ
ఈ రోజు తెలంగాణ(Telangana), ఆంధ్ర నుంచి అధిక సంఖ్య పర్యాటకులు చేరుకోవడంతో సాగర్ పరిసరాలు రద్దీగా మారాయి. పర్యాటకుల సందడి..సాగర్ అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాగర్ రిజర్వాయర్ గేట్ల నుంచి వదులుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు పరవశిస్తున్నారు. ఒకవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే మరోవైపు సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు.