30-07-2025 09:33:10 AM
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లిలో గల సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో(women degree college) ప్రవేశానికి ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాడానికి చివరి అవకాశమని ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత తెలిపారు. అర్హులైన అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దరఖాస్తు ఫారానికి జత చేయాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 7995660882, 9492017001 నెంబర్లకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.