calender_icon.png 31 July, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనులపై ప్రేమ ఉంటే కేసులు రద్దు చేయాలి

13-12-2024 02:36:04 AM

  1. ప్రభుత్వానికి రాహుల్‌గాంధీ ఆదేశాలివ్వాలి 
  2. గుండెనొప్పి వచ్చిన రైతుకు బేడీలు వేసి తీసుకెళ్తారా? 
  3. ఖైదీల హక్కులను కాలరాస్తున్న సర్కారు 
  4. ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఫైర్

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): లగచర్ల గిరిజనులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ప్రేమ ఉంటే వా రిపై పెట్టిన కేసులు రద్దు చేసేలా తమ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. గుండెనొప్పి వచ్చి న రైతు హీర్యానాయక్‌ను ఆసుపత్రికి స్ట్రెచర్ మీదో అంబులెన్స్‌లోనో తీసుకెళ్లకుండా బేడీలు వేసి తీసుకెళ్లడం సీఎం రేవంత్ క్రూర మనసత్వానికి నిదర్శనమన్నారు.

నందినగర్‌లోని తన నివాసంలో కేటీఆర్ గురువారం మీడియాతో మాట్లాడారు. గుండెల్లో నొప్పి వస్తే వైద్య సహాయం అందించడంలో ప్రభు త్వం అలసత్వం చూపిందని, ఈ వ్యవహారాన్ని బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్ర యత్నం చేసిందని మండిపడ్డారు. తమ ఒత్తిడి మేరకు సంగారెడ్డి ఆసుపత్రికి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తామని పోలీసులు చెప్పడం దారుణమన్నారు.

హీర్యానాయక్‌తో పాటు మరో ఇద్దరు రైతులు రాఘ వేంద్ర, బసప్ప ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి అనేక ఆరో గ్య సమస్యలు ఉన్నాయన్నారు. రాజ్యాంగంలోని 14, 16, 19 ఆర్టికల్స్ ప్రకారం వారి హక్కులను ప్రభుత్వం హరించడమేనన్నారు.

నూతన క్రిమినల్ చట్టం బీఎన్‌ఎస్‌ఎస్ ప్రకారం, పోలీస్, జైల్ మ్యానువల్స్ ప్రకారం అండర్ ట్రావెల్స్ ఖైదీల హక్కులను కాలరాయడమేనని ధ్వజమెత్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని, గవర్నర్ ఈ అంశంపై విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. 

విందూ వినోదాల్లో సీఎం రేవంత్..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  జైపూర్‌లో విందూ వినోదాలలో జల్సాలు చేస్తూ.. గిరిజన రైతులు జైల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు.  ప్రభుత్వానికి చేతకాకుంటే వారందరికీ అవసరమైన వైద్యానికి అయ్యే ఖర్చును తమ పార్టీ తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు.

రేవంత్ సోదరుల మాట వినలేదన్న ఒక్క కారణంతోనే గిరిజనులపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదుపులోకి తీసుకున్న వారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. థర్డ్ డిగ్రీ విషయం చెబితే తమ కుటుంబసభ్యులను కేసుల్లో ఇరికిస్తామని, భౌతిక దాడులు చేస్తామని హెచ్చరిం చినట్లు వారిని జైల్లో కలిసినప్పుడు తమకు చెప్పారని తెలిపారు.

ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి మానవత్వంతో వ్యవహరించి గిరిజనులు, ఇతర రైతులపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేసి వారిని జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 20 రోజుల పాటు దినపత్రికలు కూడా ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.