ఓజీలో మరో స్టార్?
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో ఉన్న పవన్.. నా లుగు రోజుల్లో షూ టింగ్ పూర్తి చేసుకుని ఓజీ సెట్స్‌కి వెళతారట. మొత్తంగా ఓజీ షూటింగ్ జనవరి నాటికి పూర్తవుతుందని సమాచారం. ఈ చిత్రంలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో కూడా నటిస్తున్నారట. ఆయన ఎవరనేది తెలియడం లేదు కానీ చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి డేట్స్ విషయంలో కుదరక ఇంకా ఆయన సెట్స్‌లోకి ఎంటర్ అవలేదట. క్లుమైక్స్‌లో ఈ స్టార్ హీరో ఎంట్రీ ఉంటుందని టాక్.






