18 July, 2026 | 6:26 AM

ఏఎన్నార్ తొలి చిత్రం.. రాముడిగా ప్రస్థానం..

01-12-2024 12:00 AM

ఘంటసాల బలరామయ్య దర్శక త్వం వహించడంతో పాటు నిర్మించిన చిత్రం శ్రీ సీతా రామజననం. అక్కినేని నాగేశ్వరరావు, త్రిపుర సుందరి, వేమూ రి గగ్గయ్య, రుష్యేంద్రమణి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ తెలుగు పౌరాణిక చిత్రం 1944 డిసెంబర్ 1న విడుదలైంది. ఈ చిత్రానికి రెండు విశేషాలున్నాయి. అవేంటంటే.. అక్కినేని నాగేశ్వరరావుకు, గాయకుడిగా ఘం టసాలకూ ఇది తొలి చిత్రం కావడం.

రావణుడు ముల్లోకాలనూ జయించడంతో ఈ సినిమా మొదవుతుంది. శ్రీరాముడి జననం.. దానికి సమాంతరంగా, మిథిలరాజు జనకుడు (పారు పల్లి సుబ్బారావు) నేలను దున్నుతుండగా ఆడశిశువుతో ఉన్న పెట్టె కనిపించడం వంటి అంశాలను చూపించారు. అ బిడ్డకు సీత అని పేరుపెట్టి పెంచుకుంటాడు. అటు శ్రీరాముడు యుద్ధ విద్యలలో మెలకువలు నేర్చుకోవడం వంటివి చిత్రంలో చూపించారు.

ఆ తరువాత విశ్వామిత్ర మహర్షి తన యాగ రక్షణ కోసం రామ, లక్ష్మణులను తీసుకెళ్లడం, రామలక్షణులు దిగ్విజయంగా యాగం పూర్తయ్యేలా ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూస్తారు. మరోవైపు యాగం పూర్తున తర్వాత విశ్వామిత్రుడు సీతా స్వయంవరానికి శ్రీరాముడిని తీసుకు వెళ్లడం.. చివరిగా సీతా రాముల అద్భుతమైన కళ్యాణంతో ఈ చిత్రం ముగుస్తుంది. ఈ సినిమా తర్వాత ఏఎన్నార్‌కు అవకాశాలు ఒక్కొక్కటిగా వచ్చాయి. ఆ తరువాత ఇండస్ట్రీకి అప్పట్లో ఆయన కూడా ఒక పిల్లర్‌లా మారిపోయారు.