ఆ సన్నివేశం మా సినిమాలోనిదే
01-12-2024 12:00 AM
ఆమని, వికాస్ వశిష్ఠ,మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా నారి. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీమతి శశి వంటిపల్లి ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ.. “ఇటీవల ఓ స్కూల్ అమ్మాయి తన టీచర్‌తో తన కష్టాలు చెబుతూ తాను మగవాడిగా మారాలని అనుకుంటున్నట్లు చెప్పిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ సన్నివేశం మా నారి సినిమాలోనిది” అన్నారు.






