26-11-2025 12:24:54 AM
న్యూఢిల్లీ, నవంబర్ 25: తనపై హిందుత్వ వ్యతిరేక ప్రచారం జరుగడం దురదృష్టకరమని, తాను అన్ని మతాలను గౌరవిస్తానని మాజీ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. న్యాయస్థానంలో తనపై ఓ అడ్వొకేట్ చెప్పు విసిరిన ఘటనపై తాజాగా ఆయన స్పందిస్తూ.. తాను హిందూ వ్యతిరేకంగా ఆరోపణలు చేసినట్లు వస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు.
హిందువుల మనోభావాలను అవమానించే ఉద్దేశం తనకు లేదని ఉద్ఘాటించారు. తాను స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఎన్నో దర్గాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలను సందర్శించానని తెలిపారు. తన మనస్సాక్షి స్వచ్ఛమైనదని చెప్పుకొచ్చారు. తన తండ్రి చాలా లౌకికవాది అని, ఆ లక్షణాలనే తాను అలవర్చుకున్నానని తెలిపారు