ప్రజా వ్యతిరేక బీజేపీకి గుణపాఠం చెప్పాలి

25-04-2024 02:14:46 AM

l ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల/హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ప్రజా వ్యతిరేక విధా నాలు అమలు చేస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని వేముల వాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో బుధవారం మీడియాతో మా ట్లాడుతూ.. ఇటీవల ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతు న్న తీరును ప్రజలు గమనిస్తున్నారని.. ఆయన మాటలు మతాల మ ధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని ఆరోపించారు. మోదీలో అసహనం చూ స్తుంటే కాంగ్రెస్ విజయం ఖాయం గా కనిపిస్తుందని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులకు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు. ఆయా పార్టీలు కేంద్రరాష్ట్రాల్లో పదేళ్లు అధికారంలో ఉండి పేదలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని కోరారు.

కేసీఆర్ బస్సుయాత్ర పదేళ్ల పాపానికి ప్రాయశ్చిత్తం 

పదేళ్ల పాపానికి ప్రా యశ్చితంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర నిర్వహిస్తున్నార ని, ప్రజలకు క్షమాపణలు చెప్పేందుకే ఆ యాత్ర అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నాడు అధికా రం చేతిలో ఉందన్న అహంకారం తో కేసీఆర్ ప్రగతి భవన్, ఫాంహౌ స్ దాటి బయటకు రాలేదని మండిపడ్డారు. ఓట్లతో ప్రజలు వాతలు పెడితే తప్ప ఆయనకు ప్రజలు గుర్తుకురాలేదన్నారు. రాష్ట్రంలో ప్ర జాపాలన చూసి ఆయన ఓర్వలేక పోతున్నారన్నారు.

కేసీఆర్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న ఆడబిడ్డలను చూడాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూడాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నాసిరకంగా నిర్మించిన కాళేశ్వరాన్ని, మేడిగడ్డను చూడాలన్నారు. ఆయన బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ బస్సు ఫాం హౌస్‌కే పరిమితమవుతుందని ఎద్దేవా చేశారు.