9 May, 2026 | 4:31 PM

నేడు సిద్దిపేటకు అమిత్ షా

25-04-2024 02:15 AM

l కరీంనగర్‌కు గుజరాత్ సీఎం, నిజామాబాద్‌కు ఉత్తరాఖండ్ సీఎం

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్యూ కడుతున్నారు. ఎలాగైనా తెలంగాణలో ఎక్కు వ సీట్లు సాధించాలని పట్టుబట్టారు. దీనిలో భాగంగా గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి సిద్దిపేటకు విచ్చేయనున్నారు. పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి ‘విశాల జన సభ’లో ప్రసంగించనున్నారు. అలాగే కరీంనగర్‌కు గుజరాత్ సీఎం భూపేందర్ సింగ్ పటేల్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచ్చేసి పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌తో నామినేషన్ దాఖలు చేయించనున్నారు. అనంతరం నాగర్ కర్నూల్‌కు చేరుకుని ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌కు మద్దతుగా ర్యాలీలో పాల్గొననున్నారు. నిజామాబాద్‌లో ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ నామినేషన్ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఎంపీ లక్ష్మణ్ హాజరుకానున్నారు.