11 August, 2026 | 2:51 AM

కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

11-08-2026 12:54 AM

కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలి

సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య 

గజ్వేల్‌లో ర్యాలీ రాస్తారోకో

గజ్వేల్, ఆగస్టు 10 (విజయక్రాంతి) : కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, కార్మిక కోడులు, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ గజ్వేల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో జైలు భరో నిర్వహించారు. పాత మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలపై భారాలు మోపే విధానాలను వ్యతిరేకిస్తూ భవిష్యత్లో దీర్ఘకాలిక ఉద్యమాలు చేపడతామని ఎల్లయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.