13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

జపనీస్ గ్రాండ్ ప్రీ విజేతగా ఆంటోనెల్లి

30-03-2026 01:37 AM

19 ఏళ్ల కుర్రాడి సంచలనం

ఫార్ములా వన్‌లో సరికొత్త రికార్డు

టోక్యో, మార్చి 29 : ఫార్ములావన్‌లో సరికొత్త యువ కెరటం దూసుకొచ్చింది. 19 ఏళ్ల వయసులోనే కిమి ఆంటోనెల్లి అనే కు ర్రాడు ఎఫ్1 ఛాంపియన్‌గా నిలిచాడు. తా జాగా జపనీస్ గ్రాండ్ ప్రిక్స్‌లో అద్భుత విజ యం సాధించాడు. తద్వారా రెండు దశాబ్దాల పాటు చెక్కుచెదరని రికార్డును బ్రేక్ చే శాడు. ఆంటోనెల్లి 19 ఏళ్ల 6 నెలల 28 రోజు ల వయస్సులోనే డ్రైవర్ల ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. దీంతో ఈ జాబితాలో పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు.

19 ఏళ్ల 6 నెలలకే జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ గెలవడం ద్వారా చరిత్ర సృష్టించాడు. గతంలో లూయిస్ హామిల్టన్ 22 ఏళ్ల 4 నెల ల వయసులో 2007 కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్ గెలిచి రికార్డు నెలకొల్పగా.. దాదాపు 19 ఏళ్ల పాటు రికార్డు హామిల్టన్ పేరిటే ఉం ది. తాజాగా దానిని ఆంటోనెల్లి బ్రేక్ చేశాడు. ఆంటోనెల్లి దూకుడు చూస్తుంటే ఫార్ములావన్‌లో కొత్తతరం ఆధిపత్యం మొదలైనట్టే కనిపిస్తోంది.