కింగ్స్ వర్సెస్ రాయల్స్
నేడు చెన్నైతో రాజస్థాన్ ఢీ
ధోనీ లేకుండా బరిలోకి సీఎస్కే
వైభవ్ సూర్యవంశీపైనే అందరి చూపు
గుహావటి, మార్చి 29 : ఐపీఎల్ 19వ సీజన్‌లో ఇవాళ ఆసక్తికర పోరు జరగబోతోంది. లీగ్ లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. కండరాల నొప్పితో ధోనీ దూరమైన నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీకి ఈ సీజన్ పరీక్షగా మారనుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కిం గ్స్ గత సీజన్‌లో నిరాశ పరిచింది. 14 మ్యా చ్‌లలో కేవలం నాలుగే విజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది.
ఇక సీఎస్కే బ్యా టింగ్ లైనప్‌ను చూసుకుంటే సంజూ, రుతురాజ్ ఓపెనర్లుగా రానుండగా.. ఆయు శ్ మాత్రే వన్‌డౌన్‌లో దిగుతాడు. తర్వాత బ్రెవి స్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్ వంటి వారి తో పటిష్టంగానే ఉంది. అటు బౌలింగ్‌లో జేమీ ఓవర్టన్, ఖలీల్ అహ్మద్‌లపైనే భా రం పడనుంది. మరో మీడియం పేసర్‌గా అన్షు ల్ కాంబోజ్ పైనా చెన్నై ఆశలు పెట్టుకుంది. స్పిన్ విభాగంలో నూర్ అహ్మద్‌తో పాటు రాహుల్ చహర్ కీలకం కానున్నాడు. కాగా ధోనీ దూరమవడంతో కీపింగ్ బాధ్యతలు సంజూనే తీసుకోనున్నాడు.
ఇంపాక్ట్ ప్లే యర్‌గా కార్తీక్ శర్మను ఆడించే అవకాశముం ది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా గత సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఈజీగా గెలిచే కొన్ని మ్యాచ్‌లను చేజేతులా ఓడిపోయింది. ఫలితంగా నాలుగే విజయాలతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. జైశ్వా ల్, వైభవ్ సూర్యవంసీ, హెట్ మెయిర్ లాం టి హిట్టర్లున్నా పెద్దగా ఆకట్టుకోలేకపోయిం ది.
ఈ సారి సంజూ శాంసన్‌ను ట్రేడిం గ్‌లో వదులుకున్న రాయల్స్ జడేజా, సామ్ కరన్ లను తీసుకుంది. అయితే సామ్ కరన్‌గా యంతో సీజన్‌కు దూరమవడం రాజస్థాన్ కు ఎదురుదెబ్బగానే చెప్పాలి. ప్రస్తుతం సం జూ స్థానంలో రియాన్ పరాగ్ సారథ్య బా ధ్యతలు తీసుకున్నాడు. గత సీజన్‌లో కూ డా పరాగ్ రాజస్థాన్ ను నడిపించినా కెప్టెన్‌గా ఇంప్రెస్ చేయలేదు.
కాగా రాజస్థాన్ రాయ ల్స్ బ్యాటింగ్ లైనప్‌లో వైభవ్ సూర్యవంశీ పైనే అందరి చూపు ఉంది. 15 ఏళ్ల వై భవ్ గత సీజన్‌లో దుమ్మురేపాడు. అరం ట్రం సీజన్‌లోనే సెంచరీతో చెలరేగిపోయా డు. ఇటీవల అండర్ 19 ప్రపంచకప్‌లోనూ పరుగుల వరద పారించిన వైభవ్ సూ ర్యవంశీ నుంచి రాయల్స్ మెరుపు ఆరంభాల ను ఆశిస్తోంది. జైస్వాల్, వైభవ్ జోడీతో పాటు రియాన్ పరాగ్, హెట్ మెయిర్, జురెల్ కూ డా రాణిస్తే రాయల్స్‌కు తిరుగుండదు. బౌ లింగ్‌లో ఆర్చర్, సందీప్ శర్మ, ఆడమ్ మిలై న్ పేస్ భారాన్ని మోయనుండగా.. రవి బిష్ణో య్ స్పిన్నర్‌గా ఉన్నాడు. రాజస్థాన్ ఇం పాక్ట్ ప్లేయర్‌గా హైదరాబాదీ క్రికెటర్ అమన్ రావును ఆడించే అవకాశముంది.
పిచ్ రిపోర్ట్
గుహావటి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ఛే జింగ్ చేసేందుకు మొగ్గుచూపుతుంది. రెం డో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావంతో బ్యాట ర్ల పని సులువవుతుంది.
గత రికార్డులు
ఐపీఎల్ ముఖాముఖి రికార్డుల్లో ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. ఇప్పటి వర కూ 32 మ్యాచ్‌లలో తలపడితే సగం సగం గెలిచాయి.
తుది జట్లు (అంచనా)
చెన్నై సూపర్ కింగ్స్ : సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుశ్ మాత్రే, బ్రెవిస్ , శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, రాహుల్ చహర్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్
ఇంపాక్ట్ ప్లేయర్ : కార్తీక్ శర్మ
రాజస్థాన్ రాయల్స్ : జైశ్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్), హెట్‌మెయిర్, జురెల్(కీపర్), జడేజా, శనక, ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, ఆడమ్ మిలైన్
ఇంపాక్ట్ ప్లేయర్ : అమన్‌రావు పేరాల




