రోహిట్.. ముంబై హిట్
ఐపీఎల్ చరిత్రలో తొలి మ్యాచ్‌లో ఓటమి సెంటిెమెంట్‌ను ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బ్రేక్ చేసింది. వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ, రికెల్టన్ సృష్టించిన విధ్వంసంతో కోల్‌కత్తాను చిత్తుగా ఓడించింది. రోహిత్ శర్మ, రికెల్టన్ విధ్వంసం స్టేడియాన్ని ఊపేసింది. సిక్సర్లు, బౌండరీలతో 221 పరుగుల భారీ టార్గెట్‌ను ముంబై ఊదిపారేసింది. తద్వారా 13 ఏళ్ల తర్వాత సీజన్ తొలి మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. దీంతో కోల్‌కతా సారథి రహానే మెరుపులు ముంబై ఓపెనర్ల ముందు తేలిపోయాయి.
ఓటమి సెంటిమెంట్ బ్రేక్
13 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్‌లో విజయం
దంచికొట్టిన రికెల్టన్, రోహిత్
ముంబై, మార్చి 29 : ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎం చుకుంది. వాంఖడే స్టేడియంలో ఛేజింగ్ జ ట్టుకే అవకాశాలుండడమే దీనికి కారణం. సూర్యకుమార్ యాదవ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపుతూ ముంబై సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్‌కు ఓపెనర్లు రహానే, ఫిన్ అలెన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 5.2 ఓవర్లలోనే 69 పరుగులు జో డించారు. అలెన్ 37( 17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) , రూ.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన క్రిస్ గ్రీన్ (17) ఫెయిలయ్యాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా రహానే మాత్రం దు మ్మురేపాడు. రహానే 40 బంతుల్లో 67 ( 3 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేశాడు. రహానే దూకుడుగా ఆడే క్ర మంలో ఔటవగా.. రఘువంశీ మెరుపు బ్యా టింగ్‌తో చెలరేగిపోయాడు. కేవలం 29 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసాడు. అటు వైస్ కెప్టెన్‌గా ప్రమోష న్ దక్కించుకున్న రింకూ సింగ్(33) చివర్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఫలితంగా కోల్ కతా నైట్ రైడ ర్స్ 20 ఓవర్లలో 220 పరుగు లు చేసింది. భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ రెచ్చిపోయి ఆడారు.
వాంఖడేలో పరుగుల సునామీ వచ్చిం దా అన్న రీతిలో చెలరేగిపోయారు. వీరిద్దరూ బౌండరీలు, సిక్సర్లు బాదేస్తుంటే కోల్ కతా బౌలర్ల కు దిక్కుతోచలేదు. చూస్తుండగానే పవర్ ప్లేలో 80 పరుగులు చేసిన ముంబై తర్వాత మరింత దూకుడుగా సాగిం ది. రికెల్టన్, రో హిత్ సిక్సర్లు బాదేందుకు పోటీపడ్డారంటే ఎలా ఆడారో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరినీ కట్టడి చేయడంలో కేకేఆర్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. రికెల్టన్, రో హిత్ తొలి వికెట్ కు 148 పరుగులు జోడించగా.. అప్పటికే ముంబై విజయం ఖాయమైపోయింది.
రోహిత్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి ఔటయ్యాడు. అటు రికెల్టన్ 81 ( 43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు) రన్స్ కు పెవిలియన్ చేరుకున్నాడు. తర్వాత సూర్యకుమార్ యా దవ్ (16), తిలక్ వర్మ (20) పరుగులకు ఔటవగా...హార్థిక్ పాండ్యా, నమన్ ధీర్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. ముంబై ఇండియన్స్ మరో 5 బంతులు మిగిలుండగా 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల టార్గెట్‌ను ముంబై ఛేదించడం ఇదే తొలిసారి. గతంలో ఢిల్లీపై ఛేదించిన 219 పరుగులే ఇప్పటి వరకూ రికార్డుగా ఉంది.
స్కోరు బోర్డు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : 220/4 (రహానే 67, రఘువంశీ 51, ఫిన్ అలెన్ 37, రింకూ సింగ్ 33 నాటౌట్; శార్థూల్ ఠాకూర్ 3/39, హార్థిక్ పాండ్యా 1/39)
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 224/4 ( రికెల్టన్ 81, రోహిత్ శర్మ 78, తిలక్ వర్మ 20, హార్థిక్ 18 నాటౌట్, నరైన్ 1/30, కార్తీక్ త్యాగి 1/43)




