calender_icon.png 4 July, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తాం: సీఎం చంద్రబాబు

11-07-2024 05:24:31 PM

అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఉత్తరాంధ్రలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి వద్ద గురువారం పోలవరం ఎడమ కాల్వను పరిశీలించారు. అంతకుముందు కాలువ పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనకు వచ్చిన సీఎంకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే ఉత్తరాంధ్రలో సాగు, తాగునీటి సమస్యలు ఉండవని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. వంశధార-గోదావరి-కృష్ణా-పెన్నా నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.