ఏపీ ముగ్గురు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు
న్యూఢిల్లీ : కేంద్రంలో ఎన్డీఏ సర్కారు కొలువుదీరనుంది. రాష్ట్రపతి భవన్ లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఆదివారం రాత్రి 7.15 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్రమంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గరు ఎంపీలకు చోటులభించింది. శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ హోదా, గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయమంత్రి హోదా దక్కగా.. నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గలో చోటుదక్కింది. వీరూ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎంపీలతో పాటు తెలంగాణ నుంచి గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కింది. కిషన్ రెడ్డి ఇదివరకే మోదీ కేబినెట్ పనిచేశారు.






