10 May, 2026 | 4:24 PM

స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగి ఏపీ యువకుడు మృతి

05-09-2025 11:41 AM

బాపట్ల: అమెరికాలోని బోస్టన్‌లో స్విమ్మింగ్ పూల్‌లో(Swimming Pool) మునిగి ఒక వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలోని మార్టూరుకు చెందిన పాటిబండ్ల లోకేష్ (23) గా గుర్తించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా(America) వెళ్లిన లోకేష్ ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించి, గత ఎనిమిది నెలలుగా బోస్టన్‌లో ఉంటున్నాడు. బంధువుల ప్రకారం, సెప్టెంబర్ 3న లోకేష్ ఈతకు వెళ్లినప్పుడు ఈ విషాద సంఘటన జరిగింది. గురువారం రాత్రి ఆయన మరణం గురించి మార్టూరులోని కుటుంబసభ్యులకు సమాచారం అందింది. బోస్టన్‌లో లోకేష్‌కు దగ్గరి కుటుంబ సభ్యులు ఉన్నారని, వారు ఆయన మృతదేహాన్ని భారతదేశానికి పంపేందుకు చర్యలు ప్రారంభించారని బంధువులు తెలిపారు.