calender_icon.png 4 July, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విపత్తు సమయంలో ‘ఆపద మిత్ర’ వలంటీర్లు ముందుండాలి

04-07-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, జూలై 3 (విజయ క్రాంతి): ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దుర్ఘటన సమయంలో ప్రజలను రక్షించేందుకు ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రెవిన్యూ శాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యం లో జిల్లాలోని 120 మంది డిగ్రీ విద్యార్థులు, ఎన్. సి. సి వాలంటీర్లకు 12 రోజులపాటు ఇవ్వనున్న ఆపదమిత్ర శిక్షణను గురువారం బీసీ స్టడీ సర్కిల్లో ప్రారంభించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్ప తి మాట్లాడుతూ అవగాహన లేకపోవడం వల్ల నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వ ర్లు, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్‌పాల్గొన్నారు.