calender_icon.png 4 July, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనత్ నగర్ లో అగ్ని ప్రమాదం.. బాధితులకు ధైర్యం చెప్పిన డాక్టర్ కోట నీలిమ

03-07-2025 11:19:01 PM

సనత్ నగర్ (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్‌లో పెను అగ్నిప్రమాదం తృటిలో తప్పింది. ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. రాజరాజేశ్వరి నగర్‌లో నివాసం ఉంటున్న సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. వెంటనే మంటలు వ్యాపించి ఇంట్లోని ఫర్నిచర్, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లడంతో పెను ముప్పు తప్పింది. 

విషయం తెలుసుకున్న సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ(Congress Party In-charge Dr. Kota Neelima) సంఘటనా స్థలాన్ని సందర్శించి, బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదన్నారు. కానీ, ఇంట్లోని సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైందని తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయని పేర్కొన్నారు.