03-07-2025 11:21:25 PM
దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు..
కోదాడ: మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామం సాయిబాబా దేవాలయంలో ఈనెల 10వ తేదీన నిర్వహించే గురుపౌర్ణమి వేడుకలకు సంబంధించిన కరపత్రాన్ని దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు(Temple Chairman Nalapati Narasimha Rao) ఆధ్వర్యంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గురు పౌర్ణమి వేడుకలు దేవాలయంలో అంగరంగ వైభవంగా 9, 10వ తేదీలలో రెండు రోజులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ ఉదయం ఐదు గంటలకు కాగడ హారతి, 5:30 నుండి 6:30 వరకు స్వామివారికి ఆవుపాలు, చందన అభిషేకం కార్యక్రమం, ఏడు గంటలకి అలంకార దర్శనం, 11 గంటలకు గురుపూజ కార్యక్రమం, 12 గంటలకు మధ్యాహ్నం హారతి, 12 గంటల 30 నిమిషాలకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు సంధ్యా హారతి, ఏడు గంటలకి పల్లకి సేవ, ఎనిమిది గంటలకి శేష హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. దాతలు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నర్రా వెంకటేశ్వరరావు, రామచంద్రరావు, ఏదులాపురం శ్రీనివాసరావు, శరబయ్య, కోళ్లూరి రామారావు, శేషు, సుబ్బారావు,ప్రగడ వెంకటేశ్వరరావు, బట్టు కోటేశ్వరరావు, పూర్ణ, నారాయణరావు, ఈదర వెంకటేశ్వరరావు, శ్రీను, బాలయ్య, అర్చకులు సాయి శర్మ తదితరులు పాల్గొన్నారు.