04-12-2025 12:00:00 AM
ప్రోస్టేట్ క్యాన్సర్‌పై అవగాహన
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): అపోలో క్యాన్సర్ సెంటర్స్ ఆధ్వ ర్యంలో బుధవారం ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం ‘టేమ్ ద ఫైర్!’ నిర్వహిం చారు. కార్యక్రమాన్ని డాక్టర్ ఆర్. శ్రీనాథ్ భారద్వాజ్ ప్రారంభించారు. ముఖ్య అతిథి విక్రమ్ సింగ్ మాన్, డైరెక్టర్ జనరల్, తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్, ప్రముఖులైన డాక్టర్ పి. విజయానంద్ రెడ్డి, డైరెక్టర్, అపో లో క్యాన్సర్ సెంటర్స్, డాక్టర్ సంజయ్ కుమార్ అద్దల తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ విజయానంద్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రోస్టేట్ క్యాన్సర్ ఓ సైలెంట్ కిల్లర్ లాంటిదని దీనిని ప్రారంభ దశలో గుర్తించకపోతే పెద్ద ప్రమాదంని కానీ ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయగలిగేది అని అన్నారు. అపోలో కాన్సర్ సెంటర్ డా. సంజయ్ కుమార్ అద్దల ప్రారంభ దశలో పరీక్షల ప్రాధాన్యాన్ని వివరించారు. డా. అశ్విన్ ఎం. షా ప్రోస్టేట్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలను తెలియజేశారు. డా. ఎస్‌విఎస్‌ఎస్. ప్రసాద్ తాజా చికిత్సా పద్ధతులపై మాట్లాడారు.
ప్రారంభ పరిశీలన ప్రాముఖ్యత, హెచ్చరిక లక్షణాలు మరియు ఆధునిక చికిత్సా విధానాలపై వివరించారు. క్యాన్సర్‌ను జయించిన సుధాకర్, వేణుగోపాల్ తమ అనుభవాలను పంచుకున్నారు. క్యాం డిల్ లైటింగ్, బ్లోయింగ్ కార్యక్రమాన్ని విక్రమ్ సింగ్ మాన్ ప్రారంభించారు. 50 ఏళ్లు పైబడిన పురుషులు, కుటుంబంలో చరిత్ర ఉన్నవారు తప్పనిసరిగా నిరంతర స్క్రీనింగ్ చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తేజస్వీ రావు వీరపల్లి, రీజినల్ సీఈఓ, అపోలో హాస్పిటల్స్ (ఏపీ, తెలంగాణ), డా. నిఖిల్ సురేష్ ఘడియపాటిల్ పాల్గొన్నారు.