calender_icon.png 5 December, 2025 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారంతో పోటీ పడుతున్న వెండి

04-12-2025 12:21:49 AM

కిలో రూ.1.80 లక్షలకు పైగానే

హైదరాబాద్, డిసెంబర్ 3: అంతర్జాయ మార్కెట్‌లో వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. సామాన్యుడుకి అందనంత ఎత్తు లో సిల్వర్ ధరలు ఉన్నాయి. బంగారంతో పాటు సమానంగా వెండి రేట్లు ఉన్నాయి. దేశీయంగా కిలో వెండి రూ.1.84 లక్షలకు చేరుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. బం గారం సైతం రూ.1.30 లక్షల పైనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరగడానికి తోడు, రూపాయి విలువ పడిపోవడంతో బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా మల్టీ కమోడిటీ ఎక్సైంజ్(ఎంసీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్‌లో 2026 ఫిబ్రవరి కాంట్రాక్ట్ 10 గ్రాముల ధర రూ.1.30 లక్షలు పలుకుతోంది.

అదే సమయంలో ఎంసీఎక్స్‌లో మార్చి డెలివరి వెండి అత్యధికంగా రూ. 3,126 పెరిగి రూ.1,84,727 వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకుంది. బుధవారం డాలరుతో రూపాయి మారకం విలువ 90 మా ర్కు దాటింది. దీంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. దీనికితోడు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిసుందన్న అంచనాలు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో ఫ్యూచర్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుదలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

మధ్యాహ్నం ఒంటి గంట సమయా నికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1.32లక్షలు ఉండగా.. కిలో వెండి రూ.1.83 లక్షలు పలుకుతోంది. గతంలో దేవుళ్ల బొ మ్మలు, పూజా సామగ్రి, ధనవంతుల ఇళ్లల్లో పళ్లాలు, గ్లాసులకు వెండిని ఎక్కువగా వినియోగించేవారు. కొవిడ్ తర్వాత పరిస్థితులు మారాయి. పారిశ్రామికంగా వెండి వినియో గం బాగా పెరిగింది.