దివ్యాంగులకు క్షమాపణలు చెప్పాలి
14-08-2026 01:44 AM
పీసీసీ వికలాంగుల కమిటీ చైర్మన్ వీరయ్య
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : వికలాంగులను కించపర్చేలామాట్లాడిన బీఆర్‌ఎస్ నాయకుడు వి. ప్రకాష్ వెంటనే ఆ సమాజానికి క్షమాపణలు చెప్పాలని పీసీసీ వికలాంగుల కమిటీ చైర్మన్ ముత్తినేని వీరయ్య డిమాండ్ చేశారు. ఒక టీవీ ఛానల్‌లో వికలాంగులను కించపర్చే విధంగా, మా మనోభావాలను దెబ్బతీసేలా ప్రకాష్ మా ట్లాడారని వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.






