ప్లాస్టిక్ దుకాణాలపై అధికారుల దాడులు
14-08-2026 01:43 AM
నిర్మల్, ఆగస్టు 13 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో నిబంధనలను అతిక్రమించి సింగిల్ యూస్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణాలపై మున్సిపల్ కమిషనర్ రవిబాబు అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో దాడులు నిర్వహించారు.
నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలను సీజ్ చేశారు. దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించవద్దని సూచించారు. కొన్ని దుకాణాలకు అపరాధ రుసుం విధించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.






