03-12-2025 12:05:54 AM
కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ఎన్నో ఏళ్ల కల రిజర్వేషన్ల పుణ్యమా అని కలిసి వచ్చింది అని సర్పంచ్ గా పోటీచేసి తమ కలను నిజం చేసుకోవాలని భావిస్తున్న వారు కొందరైతే మరికొందరు తమకు అనుకూలంగా ఉండి నామినేషన్ వేసిన వారిని విత్ డ్రా చేయించే ప్రయత్నాల్లో పలువురు సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. అంతేకాకుం డా గ్రామాల్లో బొజ్జగింపుల జోరు కొనసాగుతుంది.
స్కూటీ0గ్ పూర్తి కావడంతో, విత్ డ్రా చేయించేందుకు గ్రామాల లో పోటీల్లో ఉన్న అభ్యర్థుల కు బుజ్జగింపులు చేపడుతున్నారు. మరోవైపు ప్రలోభా లతో విత్ డ్రా చేయించేందుకు తంతాలు పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం తమ అనుచరుల తో గ్రామాల్లో తమ మద్దతు ఇచ్చిన వారు గెలిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బిజెపిలకు చెందిన నాయకులు సైతం తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మద్దతు ఇస్తూ గ్రామాల్లో పావులు కదుపుతున్నారు. కొంతమంది సర్పంచిగా గెలిచేందుకు ఆస్తులను తాకట్టు పెట్టి బరిలో నిలుస్తున్నారు.
నామినేషన్ల పర్వంలోనే విందులు షురూ చేశారు. కుల సంఘాలు, యువకులను, యువజన సం ఘాలను కలిసి మూకుమ్మడిగా మద్దతిస్తే నజరాణాలు చెప్తున్నారు. గెలిచిన తర్వాత నజరాణాలు ఇస్తామంటూ నమ్మబల్కుతున్నారు. కొంతమంది దేవాలయాల మీద ఒట్టు పెట్టుకొని కమిట్మెంట్ తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా బుజ్జగిం పులు, ప్రల్లోబాలు కొనసాగుతున్నాయి.
జనరల్ స్థానాల్లో సందడి
సర్పంచ్ స్థానానికి జనరల్ రిజర్వేషన్లు వచ్చిన గ్రామాల్లో సందడిగా మారాయి. జనరల్ స్థానాల్లో ఎక్కువమంది సర్పంచి స్థానానికి పోటీపడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు కుల సంఘాలను, యువకులను, ప్రాధేయపడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈనెల 11న మొదటి విడత కామారెడ్డి డివిజన్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు సందడిగా మారా యి.
హోటల్లు కుల సంఘాల వద్ద మందు, విందులు కొనసాగుతున్నాయి. లోలోపట ఓటర్లను మజ్జిగ చేసుకునేందుకు సర్పంచ్ అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. సర్పంచ్ కు మద్దతు ఇచ్చే అనుచరులు సైతం ఓటర్ల ను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. రెండవ విడత ఎల్లారెడ్డి రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడవ విడత బాన్సువాడ జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులు టెన్షన్తో ఓటర్ల కోసం తంటాలు పడుతున్నారు.