3 June, 2026 | 7:19 PM

దరఖాస్తు స్వీకరణ

03-06-2026 06:05 PM

నిర్మల్(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ పట్టణాలు మండలం గ్రామాలు అభ్యర్థుల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం జిల్లాలోని మారుతి ఫంక్షన్ హాల్ జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అబ్జర్వర్ సమతా సుదర్శన్ మాట్లాడుతూ... పార్టీ బలోపేతం గురించి పార్టీ భవిష్యత్తు గురించి భవిష్యత్తులో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని సంకల్పంతో పని చేయాలని కార్యకర్తలకు సూచించడం జరిగింది అదేవిధంగా మండల గ్రామాల అధ్యక్షుల ఆశావాహుల నుండి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది దీనితో పూర్తిస్థాయి కమిటీలను నియమించడం జరుగుతుందని తెలియజేశారు.