29-12-2025 03:01:10 PM
న్యూఢిల్లీ: ఆరావళి మైనింగ్ పై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చి ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 100 మీటర్లలోపు ఆరావళి పర్వతాల వద్ద మైనింగ్ కు గతంలో సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సీజేఐ ధర్మాసనం తదుపరి ఉత్తర్వుల వరకూ గత ఆదేశాలను నిలిపివేసింది. సుప్రీంకోర్టు అమికస్ క్యూరీని నియమించింది. సుప్రీంకోర్టు ఆరావళిపై(Aravalli) వివాదం దృష్ట్యా సుమోటోగా విచారించింది. పర్యావరణ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. నాలుగు రాష్ట్రాల సీఎస్ లను కమిటీలో సభ్యులుగా చేరుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆరావళి పర్యతాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. పర్యావరణ ముప్పునకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.