13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోండి

23-03-2026 04:30 PM

నిర్మల్,(విజయక్రాంతి): టిఎస్ఆర్జెసి జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రవేశాల కోసం 10వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సోఫీ నగర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జిల్లా కన్వీనర్ డానియల్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026 27 విద్యా సంవత్సరం గను ఇంటర్ ప్రవేశాల కోసం టీఎస్ఆర్జేసీ గురుకుల సెట్ ప్రవేశ మే 3న నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంపీసీ బైపీసీ ఎంఈసిసి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం గురుకుల సెట్ ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ కోటగిరిలో సీట్లు కేటాయించబడుతుందన్నారు.

టీఎస్ఆర్జేసీ గురుకుల కళాశాలలో నాణ్యమైన భోజనం, కార్పొరేటర్ స్థాయి విద్య, ఎంసెట్ నీట్ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇతర విభాగాలు ప్రతిభ ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం జరుగుతుందన్నారు. మే 3న ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు ఆన్లైన్ లో 200 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.