13-06-2025 07:41:50 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతుందని ఇందులో భాగంగా అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed) తెలిపారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా జాతీయ కార్యాచరణ ప్రణాళిక పథకం(National Action Plan Scheme)లో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అనుభవజ్ఞులైన స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఈనెల 30 లోపు అన్ని వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.