21-01-2026 07:34:31 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ కు చెందిన ప్రముఖ పద్యకవి, వ్యాఖ్యాత, సంస్కృతభాషా ప్రచార సమితి ఆదిలాబాదు నిజామాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు డా బి.వెంకట్ విజయవాడలో అక్షరప్రవీణ జాతీయ ప్రతిభా పురస్కారమును బుధవారం అందుకున్నారు. శ్రీధర్ శ్రీ కళా వేదిక అంతర్జాతీయ సంస్థ అధ్యక్షులు డా కత్తిమండ ప్రతాప్ కుమార్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీనాగభూషణం, జాతీయ ప్రణాళిక అధికారి డా టి పార్థసారథి, జాతీయ కార్యదర్శిశ్రీ హరికోటి, ప్రముఖ శంఖునాదం ప్రముఖ దంపతులు నరసింహ్మారావు ల చేతుల మీదుగా అందుకున్నారు.
భారతదేశములోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక,గోవా , మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాలనుండి 360 మందికి పైగా కవులు కవయిత్రులు పాల్గొన్నారని వెంకట్ చెప్పారు.40 సంవత్సరాల సాహిత్య సాంస్కృతిక కళా ఆధ్యాత్మిక విద్యా సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ పురస్కార మును డా కత్తిమం ప్రతాప్ అందజేశారని ఆయన చెప్పారు. తెలుగు సాహిత్య వైభవం పై చక్కటి సందేశమును ఇచ్చానని చెప్పారు.