calender_icon.png 6 June, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వయం ఉపాధి కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

04-06-2025 10:48:32 PM

ఫస్ట్ నవరత్నాలు పర్యవేక్షకులు గుండా మనోహర్...

మహబూబ్ నగర్ టౌన్: మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వయం ఉపాధి 3 నెలల కోర్సులకు అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఫస్ట్ నవరత్నాలు పర్యవేక్షకులు గుండా మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) తన సొంత నిధులతో మహిళలకు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ తరగతులను సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఫస్ట్ నవరత్నాలు శిక్షణా సెంటర్ లో పదవ తరగతి పాస్, ఫేయిల్ అయిన అభ్యర్థులకు ఉచితంగా కంప్యూటర్ (ఎంఎస్ ఆఫీస్), ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్ తయారీ, బ్యూటీషన్, మగ్గం వర్క్ కోర్సులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారని, ఇట్టి కోర్సులకు అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.  ఈ నెల 15న వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. వివరాలకు 9440410459, 9441565895 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.