14 July, 2026 | 11:42 AM

Breaking News

కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •  

ఖండాల గ్రామంలో లేబర్ ఫోర్స్ పై కేంద్ర కమిటీ సర్వే

08-07-2026 05:16 PM

•  కేంద్ర గణాంక పతకాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లా అదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాల గ్రామంలో గణాంక శాఖ ఆధ్వర్యంలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను నిర్వహించారు. జాతీయ గణాంక శాఖ 2026వ సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులపై పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా ఖండాల  గ్రామంలో బుధవారం రోజున గణాంక శాఖ అధికారులు  నిరంక్ వర్మ, మహమ్మద్ అన్సారీ , పురం ప్రతాప్ సర్వే చేశారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పట్టణాలను, గ్రామాలను ఎంపిక చేసుకుని ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వేలో మొదట సాధారణ వివరాలతో సర్వే చేసి, అనంతరం మొబైల్ ట్యాబ్ ద్వారా పట్టణంలోని కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి, యాదృచ్ఛిక పద్ధతిలో   నెలకు ఒకసారి పూర్తి సర్వే చేసి ప్రత్యేక ట్యాగింగ్ వివరాలు నమోదు చేస్తున్నామని తెలిపారు.

తదుపరి కుటుంబ యజమాని పేరు, సభ్యుల వారి విద్యా అర్హతలు, గృహించి, పడక మంచాలు, ఉన్నత చదువులు, పట్టివిద్యా కోర్సులు, ఉద్యోగం, స్వయం ఉపాధి, వివాహ రోజువారి కూలి అనుబంధ వివరాలు, ఎలాంటి పనులు చేస్తారు, ఎన్ని గంటలు పని చేస్తారు, ఎంత వేతనం పొందారు, వివరాలతో పాటు మహిళల స్వయం ఉపాధి పొందే వారు, ఆయా వివరాలను కూడా నమోదు చేసుకుంటామని వారు తెలిపారు.