పాత్రికేయ పిల్లలకు 50% రాయితీ
08-07-2026 05:11 PM
నిర్మల్(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పనిచేస్తూ అక్రిడేషన్ ఉన్న పాత్రికేయుల పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో 50% ఫీజు రాయితీ కల్పించినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజనా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పాత్రికేయ పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించేందుకు అధికారిక ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. అవకాశాన్ని పాత్రికేయులు సద్వినియోగం చేసుకోవాలని నిబంధనలను పాటించని పాఠశాలపై చర్యలు ఉంటాయని డీఈవో హెచ్చరించారు






