1 September, 2026 | 12:43 AM

బిజెఆర్ వ్యవసాయ కళాశాలలో పుట్టగొడుగుల సాగుపై శిక్షణ

31-08-2026 11:10 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్లలోని  బాబూ జగ్జీవన్‌రామ్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని బిజెఆర్ వ్యవసాయ కళాశాల, సిరిసిల్లలో పుట్టగొడుగుల సాగుపై “ఆరోగ్య పుట్టగొడుగులు” శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ రజియా సుల్తానా, డాక్టర్ లావణ్య మాట్లాడుతూ పుట్టగొడుగుల సాగు ద్వారా రైతులు, మహిళా రైతులు, యువత తక్కువ పెట్టుబడితో అదనపు ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి, చిన్నతరహా పారిశ్రామిక అవకాశాలను పెంపొందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

డాక్టర్ ఎం. రాజేంద్రప్రసాద్ శిక్షణలో పుట్టగొడుగుల పెంపకం విధానం, సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, సబ్‌స్ట్రేట్ తయారీ, నింపడం, స్పాన్ తయారీ, వినియోగం, వివిధ రకాల పుట్టగొడుగులు, వాటి సంరక్షణ, మార్కెటింగ్‌తో పాటు పుట్టగొడుగుల సాగు ద్వారా ఆదాయం పొందే అవకాశాలపై ప్రాయోగిక అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మహిళా రైతులు, రైతులు, బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి కోరుకునేవారు, పుట్టగొడుగుల సాగుపై ఆసక్తి ఉన్నవారు పాల్గొన్నారు.