ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ
22-06-2026 06:23 PM
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి
దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 125 దరఖాస్తులు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్ వి గిరి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్, డిఆర్ఓ పాండు, జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






