28 August, 2026 | 1:57 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

22-06-2026 06:20 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి లో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ ఏపీవో జనరల్ వసంతరావు జాదవ్ అన్నారు. సోమవారం కార్యాలయం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉట్నూర్ మండలం కేస్లాగూడ గ్రామానికి చెందిన కొడప పోసు బాయి తనకి  అంగన్వాడి ఆయాగా నియమించమని అర్జీ, చెశారు.నార్నూర్ మండలం భీంపూర్ గ్రామానికి  చెందిన రాథోడ్ నారాయణ తనకి బోర్ వెల్ మంజూరు కొరకు అర్జీ కోరారు.

ఇంద్రవెల్లి మండలం హార్కాపూర్ గ్రామానికి చెందిన పుల్సింగ్ తనకి పిండి గిర్నీ లోన్ మంజూరు కల్పించామని  అర్జీ కోరారు. భీంపూర్ మండలం బాగువాన్ పూర్ గ్రామానికి చెందిన కళ ముక్తా బాయి తనకి  పోడు పట్టా ఇప్పించమని అర్జీ  చేశారు.వాంకిడి మండలం సోనాపూర్ గ్రామానికి  చెందిన సంతోషి తనకి ఏదైనా ఆశ్రమ పాఠశాలలో వర్కర్ గా నియమించమని   కొరకు  దరఖాస్తు అందజేశారు.

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మం జూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధిం చిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.