28 July, 2026 | 1:44 AM

ప్రజావాణిలో 106 దరఖాస్తులు

28-07-2026 12:02 AM

మేడ్చల్, జూలై 27(విజయ క్రాంతి): ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను జాప్యం లేకుండా సత్వరమే అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి అదనపు జిల్లా కలెక్టర్ ఫైజాన్ అహ్మద్  అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులను అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తో కలిసి 106 దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టరు మాట్లాడుతూ ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చుకొని వారి సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకంతో ప్రజలు మన వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని అదనపు కలెక్టర్  తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని దరఖాస్తుల పరిశీలనలో ఏలాంటి జాప్యం లేకుండా చూడాలని అదనపు కలెక్టరు అన్నారు. అదేవిధంగా తిరస్కరించే దరఖాస్తుల గురించి తిరస్కరణకు గల కారణాలను తప్పనిసరిగా  వివరంగా అర్జీదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.