ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
ములుగు, జూన్8 (విజయక్రాంతి): ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులకు సూచించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 31 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
అర్జీదారుల దరఖాస్తులలో పేర్కొన్న సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో 31 దరఖాస్తులు రాగా అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 21, భూ సమస్యలు 04,ఇతర శాఖలకు సంబంధించినవి 06 దరఖాస్తుల స్వీకరించగా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






