24 March, 2026 | 3:02 AM

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి

24-03-2026 12:00 AM
  1. ప్రజావాణికి 96 దరఖాస్తులు 

కలెక్టర్ ఆశీష్ సంగు వాన్

కామారెడ్డి, మార్చి 23 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణి ద్వారా వచ్చిన 96 ధరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు.

అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల లో అత్యంత ప్రాధాన్యతను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, జెడ్పి సీఈవో చందర్ నాయక్, ఆర్డిఓ వీణ, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.