22 ఏ దరఖాస్తులను పరిష్కరించాలి
కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్, ఆగస్టు 18 (విజయక్రాంతి): 22 ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చిన ప్రైవేట్ భూముల ఆస్తుల క్లియరెన్స్ కు గాను 335 జీవోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగిందని, ఆ జీవోలను అనుసరించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు.
మంగళవారం అల్వాల్ సబ్ రిజిస్టర్( వల్లభ నగర్) కార్యాలయంలో 22 ఏ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల క్లియరెన్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆన్లైన్ లో ఉన్న జీవోలతో వెరిఫై చేసి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. లింక్ డాక్యుమెంట్స్ తో వెరిఫికేషన్ చేసుకొని యూ ఎల్ సి కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి వెంటనే జాబితా నుండి క్లియరెన్స్ చేయాలని సూచించారు.
యు ఎల్ సి లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన తొలగించేలా ఆదేశాలు జారీ చేయడం అయినదని తెలిపారు. ఆన్లైన్లో ఏ విధంగా దరఖాస్తులను క్లియర్ చేస్తున్న ప్రక్రియను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని క్లియర్ అయ్యాయి, ఎంత పెండింగ్ ఉంది, అనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఆర్డీవో శ్యాంప్రకాష్, అల్వాల్ తహసిల్దారు రాములు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






