19 August, 2026 | 2:39 AM

ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయాలి

19-08-2026 01:34 AM

నిరాహార దీక్ష చేపట్టిన సీపీఎం నాయకులు 

ఎల్బీనగర్, ఆగస్టు 18 : ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం, డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా మంగళవారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా సీపీఎం, డీవైఎఫ్‌ఐ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. డివైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తదితరులు దీక్షను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నత విద్యను అభ్యసించిన, వారు నిరుద్యోగ కూరల్లో చిక్కిన యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింద న్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్స రాలు అవు తున్న నిరుద్యోగ సమస్యలు పరిష్కరించ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయన్నారు.

మోడీ ప్రభుత్వం సంవ త్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి, నిరుద్యో గులను మోసం చేశారని ఆరోపించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధి కారంలోకి వచ్చి.. ఇప్పటి వరకు ఏ నోటి ఫికేషన్ ఇవ్వలేదన్నారు.

పోలీస్ శాఖలో 21 వేల ఉద్యోగులు ఖాళీ ఉంటే 7 వేల ఉద్యోగా లకు నోటిఫికేషన్   జారీ చేశారని మండిప డ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయ కులు  చంద్రమోహన్, కీసర నర్సిరెడ్డి, సీహెచ్ వెంకన్న,  ఆలేటి ఎల్లయ్య, వీరయ్య, నరహరి, గోపి, చింతపల్లి కృష్ణయ్య, కనకయ్య, కే రాములు, కృష్ణయ్య, రాధమ్మ, కుర్మయ్య, యాదయ్య,  కాలమ్మ, శాంత, రెడ్డమ్మ, లక్ష్మణ్ నాయక్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.