గిరిజన దర్బార్‌లో స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి
ఐటిడిఏ పిఓ రాహుల్
భద్రాచలం, నవంబర్ 3, (విజయ క్రాంతి):గిరిజన దర్బార్ లో స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి మాత్రమే గిరిజనులు దరఖాస్తులు చేసు కోవాలని, ప్రభుత్వ ఉద్యోగాల కొరకు దరఖాస్తులు స్వీకరించబడవని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. సోమ వా రం నాడు ఐ టి డి ఏ సమావేశ మందిరం లో నిర్వహించిన గిరిజన దర్బార్లో యూనిట్ ఆఫీసర్ల సమక్షంలో వివిధ మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వ చ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్క రించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజనులకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకా లు అందే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఎక్కువ శాతం అ ర్జీలు పోడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ట్రైకర్ రుణాలు, పట్టా భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత రుణాలు ఇప్పించుట కొరకు, మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుట కొరకు ,మ రియు కిరాణా షాపులు, ఏఎన్‌ఎం పోస్టుల కొరకు, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల లో జీవనోపాధికి శిక్షణలు ఇప్పించుట కొ రకు, సౌర గిరి జల విద్యుత్ ద్వారా బోరు బావులు తవ్వించుకోవడానికి అనుమతి ఇ ప్పించుట కొరకు గిరిజనులు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు.
ములకలపల్లి మండలంకు చెందిన సునీత ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టా ద్వారా రైతుబంధు రుణం ఇప్పించుట కొరకు, చర్ల మండలంకు చెందిన గిరిజన మహిళలు ఈఎంఆర్‌ఎస్ పాఠశాలలో డైలీ వేజ్ వర్కర్ గా ఉద్యోగాలు ఇప్పించుట కొర కు, కారేపల్లి మండలం మండలంకు చెందిన సక్కుబాయి పోడు భూముల సమస్యలు మ రియు కరెంట్ కనెక్షన్ ఇప్పించుట కొరకు, ఆళ్లపల్లి మండలం మర్కోడుకి చెందిన అనిత ఏఎన్‌ఎం ఉద్యోగం ఇప్పించుట కొరకు, చం ద్రుగొండ మండలం టేకులపల్లి బంజారా గ్రామానికి చెందిన శివ ట్రై కార్ ఆటో రిక్షా ఇప్పించుట కొరకు, దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించు ట కొరకు, టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందినగిరిజనులు బోరుబావుల కనెక్షన్ ఇప్పించుట కొరకు, మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు గిరిజనులు దరఖాస్తులు సమర్పించారని ఆయన అన్నారు.
గిరిజన దర్బార్ లో గిరిజనులు సమర్పించిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ప్రత్యేక మైన రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులైన ప్రతి గిరిజనులకు విడతల వారీగా ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజె క్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఆర్ సి ఓ గురుకులం అరుణకుమారి, ఏవో సున్నం రాంబా బు, ఏ పీ ఓ పవర్ వేణు, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మినారాయణ,మిషన్ భగీరథ ఏ ఈ ఈ నారాయణరావు, మేనేజర్ ఆదినారాయణ, డిడి ట్రైబల్ వెల్ఫేర్ పర్యవేక్షకురాలు ప్రమీల బాయి,ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, జేడీఎం హరికృష్ణ, డి టి ఎల్ టి ఆర్ నాగేశ్వరరావు, ఇతర శాఖల సిబ్బంది మో హన్, భార్గవి, జోగారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






