పాతర్లపాడు హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం
ఎర్రుపాలెం నవంబర్ 3 (విజయ క్రాంతి) :సిపిఎం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు,రైతు సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు ని కాంగ్రెస్ గుండాలు పథకం ప్రకారం అతి కిరాతకంగా హత్య చేసి నాలుగు రోజులు దాటిన పోలీసు అధికారులు నిందితులను అరెస్టు చేయకపోవడంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య,మండల కార్యదర్శి మ ద్దాల ప్రభాకర రావుడిమాండ్ చేశారు.
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఎర్రుపాలెం రామిశెట్టి పుల్లయ్య భవనం నుండి రింగ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ ఊరేగింపులో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఘర్షణ పడ్డారని సామినేని రామారావు భార్య స్వరాజo తెలిపారని హత్యకు కారుకులైన హంతుకులను స్థానిక ప్రజలు గుర్తించారని పోలీసులు వారిని పట్టుకోవడంలో జాప్యం చేస్తున్నారని విమర్శించారు.
పాతర్లపా డు గ్రామంలో సిపిఎం పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆ గ్రామంలో సిపిఎం పార్టీ విజయం సాధించకూడదనే రాజకీయ దుర్బుద్ధితో హత్యకు పాల్పడ్డారని అన్నారు. ఈ హత్య ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేరేపించిన హ త్యాని,రామారావు చేసిన అభివృద్ధిని జీర్ణించుకోలేక రాజకీయంగా ఎదుర్కోలేక చేతకాని త నంతో అధికార ముసుగులో హత్యకు పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హత్యకు బా ధ్యులైన వారిని పట్టుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ హేయమైన నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసు యంత్రాంగం నిష్పక్ష పాతంగా విచారణ చేపట్టాలని పోలీస్ యంత్రాంగం రాజకీయ ఒత్తుడలకు లోను కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుల ఇళ్లకు పోలీసులు పహారా కాస్తున్నారని దోషులను అరెస్టు చేయడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లమోతు హనుమంతరావు, షేక్ నాగులమీరా, ఆంగోతు వెంకటేశ్వర్లు, మందడపు ప్రభాకర్, గౌర్రాజు రాములు,లగడపాటి అప్పారావు, బేతి శ్రీనివాస రావు కన్నెబోయిన శ్రీను,తాళ్లూరి వెంకట నారాయణ,చిత్తూరు కిషోర్,కొండేపాటి శివయ్య,దివ్వెల వీరాంజనేయులు,కుర్ర వెంకటరామయ్య, తదితరులు పాల్గొన్నారు.






